అందుకే గుంటూరు కారం పోయింది.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్

అందుకే గుంటూరు కారం పోయింది.. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్

మధ్య రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్  టాక్ వచ్చింది. సినిమాలో కొత్తదనం లేదని, త్రివిక్రమ్ గత చిత్రాల లాగే ఉందనే కామెంట్స్ వినిపించాయి. అయినప్పటికీ మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. అది కూడా సూపర్ స్టార్ స్టామినా వల్ల వచ్చినవే కానీ, వేరే వాళ్ళైతే పరిస్థితి దారుణంగా ఉండేదని ట్రేడ్ వర్గాల అంచనా. 

ఇదిలా ఉంటే.. గుంటూరు కారం సినిమా ప్లాప్ పై సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాను కథను నమ్ముకొని చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయని... ఎప్పుడైతే కథలు కాకండా హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేశానో అవి ప్లాప్ అయ్యాయన్నారు. అలా వచ్చినవే టాప్ హీరో, వజ్రం సినిమాలు అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా టాప్ హీరో సినిమా కథలో మార్పులు చేయడం వల్ల ఈ సినిమా ప్లాప్ గా నిలిచిందన్నారు. వజ్రం సినిమా విషయంలో కూడా   అలానే జరిగిందని చెప్పారు.  

తాజాగా  మహేష్ బాబు గుంటూరు కారం విషయంలోనూ ఇదే జరిగిందని ఎస్వీ కృష్ణారెడ్డితెలిపారు.  మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నించారని..  ఆ కారణంగానే గుంటూరు కారం రిజల్ట్ తేడా కొట్టిందన్నారు. అలాకాకుండా కథను నమ్ముకుని తీస్తే ఫలితం వేరేలా ఉండేదని చెప్పుకొచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.