ట్రెడిషనల్ సినిమాలంటేనే ఇష్టం : వెంకటేష్​ కి నచ్చితే చేస్తా

ట్రెడిషనల్ సినిమాలంటేనే ఇష్టం : వెంకటేష్​ కి నచ్చితే చేస్తా

దర్శకుడు తరుణ్‌ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెప్తా ’ చిత్రం నవంబర్‌ 1న విడుదల కానుంది. షామీర్ దర్శకత్వంలో విజయ్
దేవరకొండ నిర్మించిన ఈ మూవీ గురిం చి, తన కెరీర్‌ గురించి తరుణ్‌ భాస్కర్‌ చెప్పిన సంగతులు.

ఓరోజు విజయ్ దేవరకొండ నుంచి ఫోన్ వచ్చింది. ఒక కథ వినిపించాడు. నచ్చింది. అంతా అయ్యాక ఈ కథకి నువ్వే హీరో అన్నాడు. నమ్మలేకపోయా. భయపడ్డాను కానీ కథ నాకు సూటవుతుందనిపించి ఓకే అన్నాను. చిన్న చిన్న వాటికే స్ట్రెస్ ఫీలైపోయే సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీర్ కథ. దీనికి మూలం షామీర్ సుల్తాన్ నిర్మించిన తమిళ షార్ట్‌‌‌‌ ఫిల్మ్. దానికి ఆయన ఎన్నో అవార్డుల్ని గెల్చుకున్నారు. ఈ జానర్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాస్టర్.
మొదట్లో డైరెక్టర్ అనే భావనతో అది మార్చాలి, ఇది మార్చాలి అని ఫైర్ అయ్యేవాడిని. కానీ తర్వాత నటుడిగా ఉండటం అలవాటు చేసుకున్నా. ఇగో పక్కన పెట్టి డైరెక్టర్ చెప్పి నట్టు చెయ్యడం మొదలెట్టా. నాన్న చనిపోయాక అమ్మే పెంచింది. చాలా కష్టాలు పడింది. ఎవరేమనుకున్నా మా పంథాలో మేము బతకడం స్టార్ట్ చేశాం. నేను నలుగురిలోకి వచ్చి సరిగ్గా మాట్లాడలేను. బంధువులంతా ఏమనుకుంటారో అనే ఫీలింగ్ చాలా ఎక్కువ.

ఈ సినిమా చేశాక అది తగ్గింది. ప్రివ్యూ చూసి అమ్మ కూడా చాలా ఆనందించింది. ఎడిటర్ , డైరెక్టర్ , యాక్టర్ అనే భేదం ఏమీ ఉండదు. సందర్భాన్ని బట్టి ఏదైనా చేసేస్తా. సమయం ఉంటే ఎడిటింగ్ చేస్తా. తమిళ సినిమాలకి డబ్బింగ్ డైలాగ్స్​రాస్తా, తెలుగు సినిమాలకి లిరిక్స్​రాస్తా.
ఈ సినిమాకి కూడా డైలాగ్స్​ నేనే రాశాను. కానీ నాకు నటించాలనే కోరిక మాత్రం లేదు. ఫోకస్​ అంతా డైరెక్షన్ మీదే. చాలా కథలున్నాయి. అవన్నీ డైరెక్ట్ చెయ్యాలి. నా కథల్లో నేను హీరోగా మాత్రం చెయ్యను. సినిమా తియ్యాలనుకుంటాను కానీ లాటరీ కొట్టాలనుకోను. అయిదు కోట్ల బడ్జెట్ వరకూ ఓకే. అలాగే టైమ్‌‌‌‌ ఫ్రేమ్‌‌‌‌లో బందీ అవడం ఇష్టం ఉండదు. మంచి స్ర్కిప్టు ఉంటేనే కమిటవుతా. ఒక్కసారి స్క్రిప్టు రెడీ అయితే మార్పులూ చేర్పులూ ఉండవు. వేరే వాళ్ల డబ్బులు కాబట్టి కేర్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటాను. బీటెక్​ అనే వెబ్ సిరీస్​ చేస్తున్నా. లాస్ట్ స్టోరీస్‌ లో ఒక సెగ్మెం ట్ మాత్రమే చేస్తున్నా. మలక్‌ పేట్ రేస్​ కోర్స్​ ట్ మీద ఓ స్టోరీ బిల్డప్​ చేశాను. వెంకటేష్​ గారికి నచ్చితే చేస్తా. స్టార్ రేంజ్ సినిమాలు చెయ్యాలని లేదు. ట్రెడిషనల్ సినిమాలంటేనే నాకు ఎక్కువ ఇష్టం . అది కూడా తెలుగులోనే.