JayaJaya Jaya hey Remake: తరుణ్ భాస్కర్ హీరోగా జయజయ జయహే.. మలయాళ సూపర్ హిట్ రీమేక్

JayaJaya Jaya hey Remake: తరుణ్ భాస్కర్ హీరోగా జయజయ జయహే.. మలయాళ సూపర్ హిట్ రీమేక్

పెళ్లి చూపులు(Pelli Chupulu) సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్(Tharun Bhascker). విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమా తరువాత ఆయన చేసిన ఈ నగరానికి ఏమైంది యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తో రొటీన్ సినిమాలకు బిన్నంగా సినిమాలు చేయడం తన స్టైల్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు తరుణ్ భాస్కర్.

ఇక కేవలం దర్శకుడిగానే కాదు కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించి మెప్పించాడు తరుణ్ భాస్కర్. మహానటి, సీతారామం, మంగళవారం. కీడా కోలా వంటి సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించాడు. ఇక ఇప్పుడు ఫిల్ లెన్త్ హీరోగా కనిపించేందుకు సిద్ధమవుతున్నడట ఈ దర్శకుడు. అవును.. తాజా సమాచారం మేరకు మలయాళంలో సూపర్ హిట్ అయినా జయజయ జయహే సినిమా తెలుగులో రీమేక్ కానుందట. ఈ సినిమాలో హీరోగా తరుణ్ భాస్కర్ చేయనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుందని టాక్. 

ఇక జయజయ జయహే సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. బాసిల్ జోసెఫ్‌, ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్ జంటగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్ఛర్యపరిచింది. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ రీమేక్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.