
సత్యం రాజేష్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ దర్శకత్వంలో మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. మేఘా చౌదరి, భరత్‌కాంత్, చందన, ఎస్తేర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన ప్రియదర్శి మాట్లాడుతూ ‘రాజేష్ అన్న ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్‌గా ఉంటున్నాడు (నవ్వుతూ). నటుడిగా ఆయన ప్రయాణం, ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. కంటెంట్ చాలా కొత్తగా ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నా’ అని ఆల్ ద బెస్ట్ చెప్పాడు. సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘దర్శకుడు యుగంధర్ ఈ కథను ఎంత బాగా చెప్పాడో.. అంతే బాగా సినిమాను తీశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమా మా టీమ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’ అని అన్నాడు. తను చేసిన బెస్ట్ సినిమా అని ఎస్తేర్ చెప్పింది. ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్ అయ్యే కథ ఇది అని దర్శకుడు యుగంధర్ చెప్పాడు. ఇందులోని ఎమోషన్ అం దర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.