బిహార్లో రచ్చకెక్కిన ఫ్యామిలీ గొడవ.. మీ నాన్నను ఎప్పుడూ కాపాడకండి.. లాలూ కూతురు సంచలన కామెంట్స్

బిహార్లో రచ్చకెక్కిన ఫ్యామిలీ గొడవ..  మీ నాన్నను ఎప్పుడూ కాపాడకండి.. లాలూ కూతురు సంచలన కామెంట్స్

లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో పుట్టిన ముసలం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత నీవల్లే అంటే నీవల్లే అంటూ మొదలైన అంతర్గత విబేధాలు.. చివరికి లాలూ కూతురు, ప్రస్తుత ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ సోదరి పార్టీని వీడే వరకు వచ్చింది. అంతే కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. పార్టీనే కాదు.. పాలిటిక్స్ నుంచి కూడా తప్పుకుంటున్నాను.. కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నాను.. అని ప్రకటించిన ఆమె.. మరోసారి 2025 నవంబర్ 16 నచేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

పార్టీలో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఈమె తెలిపారు. ఘోరంగా బూతులు తిట్టారని అన్నారు. తనపై చెప్పు విసిరేందుకు ఎత్తారని.. చివరికి తన కిడ్నీపైన కూడా నీచంగా కామెంట్స్ చేశారని ఆరోపించారు. తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కోల్పోనని.. పరోక్షంగా సోదరుడు తేజస్వీ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి వయటకు రావడం వెనుక అంతర్గతంగా చాలా పెద్ద గొడవలే జరిగిఉంటాయి అనే ఊహాగానాల మధ్య ఆమె మరో బాంబ్ పేల్చారు.

ఆదివారం (నవంబర్ 16) ఎక్స్ లో చేసిన మరో పోస్ట్ తీవ్ర చర్చలకు దారితీసింది. నిన్న ఒక సోదరి, ఒక కూతురు, ఒక పెళ్లైన మహిళ, ఒక తల్లి అవమానానికి గురైంది. ఆమెను ఘోరంగా తిట్టారు.. చెప్పును చూపించారు.. సెల్ఫ్ రెస్పెట్ విషయంలో ఎక్కడా తగ్గను.. నిజాయితీని ఎప్పుడూ పాతిపెట్టను.. ఎన్నో అవమానాల మధ్య బయటకు వచ్చాను. తీవ్ర వేదనలో ఉన్న పేరెంట్స్ ను, అక్కాచెల్లెళ్లను వది బయటకు రావడం జరిగింది. నా తల్లిగారి ఇంటి నుంచి నన్ను గెంటివేశారు. నన్ను ఒక అనాధగా మార్చారు.. రోహిణి లాంటి కష్టాలు ఎవరికీ రావద్దు.. రోహిణి కూతురు ఎవరికీ ఉండదు.. అంటూ భావోద్వేగమై ట్వీట్ చేశారు. 

మీ నాన్నను ఎప్పుడూ కాపాడకండి..

ఈ పోస్ట్ చేసిన గంటకే మరో ట్వీ్ట్ చేశారు రోహిణి. నిన్న నన్ను తిట్టారు.. నన్ను డర్టీ అన్నారు. మా నాన్న బతకాలని కిడ్నీ ఇచ్చాను. కోట్లు తీసుకుని.. కిడ్నీ ఇచ్చి.. టికెట్ పొందానని.. ఆరోపిస్తున్నారు. పెళ్లైన అందరు కూతుళ్లకు నా అభ్యర్థన ఒకటే.. మీ ఇంట్లో కొడుకు.. సోదరుడు ఉంటే.. మీకు దైవ సమానుడైన తండ్రికి మీ కిడ్నీ ఇవ్వకండి. ఆ అవకాశం కొడుకులకే కల్పించండి. మీరు మీ భర్త వైపు మీ కుటుంబాన్ని కేర్ తీసుకోండి.. ఆ విషయంలో నేను చేసింది చాలా పాపంగా మారింది. నా కుటుంబాన్ని, అత్తామామలను, భర్తను, కొడుకును కాదని.. భర్త పర్మిషన్ కూడా తీసుకోకుండా.. నా దేవుడు.. నా తండ్రిని కాపాడేందుకు ఇచ్చిన కిడ్నీని ఇప్పుడు డర్టీ కిడ్నీ అంటున్నారు. నాలాగ ఎవరూ మిస్టేక్ చేయకండి. నా లాంటి కూతురు ఎవరికీ ఉండదు.. అంటూ పోస్ట్ చేశారు. 

బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సారి అధికారం మాదే అనుకున్న మహాగట్బంధన్ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీంతో కూటమిలోని ముఖ్యమైన పార్టీ ఆర్జేడీలో లుకలుకలు బయటపడుతున్నాయి. లేటెస్టుగా పార్టీని వీడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తీసుకున్న నిర్ణయం  సంచలనంగా మారింది. పార్టీతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె 2025 నవంబర్ 15వ తేదీన ప్రకటించారు. 

చాలా కాలంగా పార్టీ పరంగా రగులుతున్న అసంతృప్తి ఎన్నికల ఫలితాల తర్వాత బయటపడింది. పార్టీలో ఉండలేనని.. పార్టీ ఓటమికి కారణం అనుసరిస్తున్న విధానాలేనని పరోక్షంగా తన సోదరుడు, పార్టీ ప్రసిడెంట్ తేజస్వీ యాదవ్ కు చురకలంటించారు. 

నేను రాకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ సలహా ప్రకారం పార్టీని వీడుతున్నాను. అన్ని నిందలను మోస్తూ బయటికి వెళ్తున్నాను.. అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.