ఎంతకు తెగించార్రా.. డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్‌పై అశ్లీల వీడియో

ఎంతకు తెగించార్రా.. డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్‌పై అశ్లీల వీడియో

చట్టరీత్యం ఇండియాలో అశ్లీల వీడియోలు చూడడం నిషేదం.. అలాంటి ఏకంగా దేశరాజధాని నగరం నడిబొడ్డున డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డుపై అసభ్యకరమైన అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమైయ్యాయి. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కన్నాట్ ప్లేస్ లోని డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులో అశ్లీల వీడియో ప్రదర్శించడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి కన్నాట్ ప్లేస్‌లోని హెచ్ బ్లాక్‌లో అడ్వర్టైజ్ మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఓ ఎల్ఈడీ స్ర్కీన్ మీద బ్లూ ఫిల్మ్ వీడియో ప్లే అవుతుండడాన్ని అటుగా వెళ్తున్న బాటసారులు దాన్ని గమనించారు. దీంతో ఆ విషయాన్ని న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ఎన్‌డిఎంసి ఆఫీసర్లు ఆ వీడియో క్లిప్‌ను బోర్డు నుంచి తీసేశారు. 

  • ALSO READ | దేశంలో కుల గణన అవసరమా.. లేదా..? ప్రజల అభిప్రాయం ఇదే

ఎవరో డిస్ల్పేను హ్యాక్ చేసి ఇలా చేయారని అధికారులు ఆరోపిస్తున్నారు.  ఎన్‌డిఎంసి పరిధిలోని 50  అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. NDMC దాని అధికార పరిధిలో రెండు రకాల ప్యానెల్‌లను నిర్వహిస్తుందని చెప్పింది. ఒకటి ప్రకటనల కోసం,మరొకటి ఇంటరాక్టివ్ టచ్‌స్క్రీన్. ఈ రెండు ప్యానెల్‌లు అంతర్జాతీయ ప్రమాణాలు, సేఫ్టీతో ఉంటాయని తెలిపింది. ఫైర్‌వాల్, యాంటీవైరస్‌తో పూర్తిగా భద్రపరచబడిన సర్వర్ ద్వారా నియంత్రించబడతాయి. రద్దీ ప్రాంతాల్లో NDMC పబ్లిక్ హాట్ స్పార్ట్ లు కూడా అందిస్తుందని వాటి ద్వారా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.