రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్

రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
  • ఓ విషయంపై నాకు అసంతృప్తి ఉంది: సూపర్ స్టార్

పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో జరగబోయే  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయన రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. .. చాలా విషయాలు తమ మధ్య చర్చకు వచ్చాయని చెప్పారు. జిల్లా అధ్యక్షులతో సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. అయితే తనకు ఓ విషయంలో అసంతృప్తి ఉందని.. సమయం వచ్చినప్పుడు అదేంటో బయటపెడతానని అన్నారు.

ఇటీవల తనతో ముస్లిం నాయకుల భేటీ గురించి ప్రస్తావిస్తూ సీఏఏకి వ్యతిరేకంగా మద్దతు తెలపాలని వారు కోరినట్లు చెప్పారు రజనీకాంత్. హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చించి.. అనుమానాలను నివృత్తి చేసుకోవలసిందిగా వారికి సూచించానన్నారు. అవసరమైతే తనవంతు సాయం చేస్తానని చెప్పానని అన్నారు. కమల్, రజినీ జోడీ… జయలలిత, కరుణానిధి లేని లోటును పూడ్చుతుందా అని మీడియా ప్రశ్నించగా.. కాలమే సమాధానం చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు.