కరోనా, ఎకానమీపై హెచ్చరికలను కేంద్రం పట్టించుకోలేదు

కరోనా, ఎకానమీపై హెచ్చరికలను కేంద్రం పట్టించుకోలేదు

మండిపడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనాతో అప్రమత్తంగా ఉండాలని తాను హెచ్చరించినప్పటికీ కేంద్రం పెడ చెవిన పెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలన్న తన వ్యాఖ్యలను చెత్త అంటూ కొట్టి పారేశారన్నారు. ఫలితంగా విపత్తు కొనసాగుతోందన్నారు. అలాగే చైనాతో వివాదంపై కూడా కేంద్రాన్ని తాను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించానని గుర్తు చేశారు.

‘కరోనాతోపాటు ఎకానమీ విషయంలో వారిని హెచ్చరించా. వాళ్లు దాన్ని పట్టించుకోలేదు. విపత్తు కొనసాగుతోంది. చైనా విషయంలో కూడా వారిని హెచ్చరించా. వాళ్లు దాన్నీ చెత్త అని కొట్టి పారేస్తున్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. చైనాను ఎదుర్కోవడానికి గ్లోబల్ విజన్ ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ఓ వీడియోలో రాహుల్‌ చెప్పారు.