అమెజాన్‌లో ఫోన్లపై డిస్కౌంట్లు

V6 Velugu Posted on Jul 27, 2021

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీ అమెజాన్‌‌ ‘ప్రైమ్‌‌డే సేల్‌‌’ను సోమవారం మొదలుపెట్టింది. ఇది మంగళవారం ముగుస్తుంది. స్మార్ట్‌‌ఫోన్లు, హోం అప్లియెన్సెస్‌‌, ఎలక్ట్రానిక్‌‌ ప్రొడక్టులపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌‌, క్యాష్‌‌ డిస్కౌంట్‌‌ వంటి ఆఫర్లు ఇస్తోంది. ప్రైమ్‌‌ మెంబర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.  అంతేగాక హెచ్‌‌డీఎఫ్‌‌సీ కార్డులు/ఈఎంఐలతో కొంటే 10 శాతం డిస్కౌంట్‌‌ అదనం. మ్యాగ్జిమమ్‌‌ రూ.1,500 వరకు డిస్కౌంట్‌‌ పొందొచ్చు. అమెజాన్‌‌ ఈసారి రూ.10 వేలలోపు ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అవేంటో చూద్దాం...
రెడ్‌‌మీ 9: రూ.10 వేలలోపు ధర గల బెస్ట్‌‌ఫోన్లలో రెడ్‌‌మీ 9 ఒకటి. ఈ సేల్‌‌ సందర్భంగా 4జీబీ+64 జీబీ వేరియంట్‌‌ను రూ.8,700 లకే దక్కించుకోవచ్చు.  ఇందులో మీడియాటెక్‌‌ జీ35 ప్రాసెసర్‌‌, 5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ ఉన్నాయి. 
శామ్‌‌సంగ్‌‌ గెలాక్సీ ఎం11: ఈ ఫోన్‌‌ 4జీ+64 జీబీ వేరియంట్‌‌ను రూ.10 వేలకు సొంతం చేసుకోవచ్చు. ఇందులో స్నాప్‌‌డ్రాగన్‌‌ 450 ప్రాసెసర్‌‌, 5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ ఉంటాయి.
రెడ్‌‌మీ 9ఏ: రెడ్‌‌మీ సిరీస్‌‌ ఫోన్లలో అతి తక్కువ రేటున్న ఫోన్‌‌ ఇదే. 3జీబీ+32 జీబీ స్టోరేజీతో వచ్చే ఈ బడ్జెట్‌‌ ఫోన్‌‌ ధర రూ.6,800. ఇందులో మీడియాటెక్‌‌ జీ25 ప్రాసెసర్‌‌, 5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ ఉన్నాయి. 
రియల్‌‌మీ సి11 (2021) : ఈ ఎంట్రీ లెవెల్‌‌ ఫోన్‌‌ 2జీబీ+32 జీబీ వేరియంట్‌‌కు రూ.తొమ్మిది వేలు. ఇందులో మీడియాటెక్‌‌ జీ35 ప్రాసెసర్‌‌, 5,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 
టెక్నో స్పార్క్‌‌ 7టి:  ఈ ఫోన్‌‌ 4జీబీ+64 జీబీ వేరియంట్‌‌ను రూ.తొమ్మిది వేలకు దక్కించుకోవచ్చు.  ఇందులో 48 ఎంపీ కెమెరా, మీడియాటెక్‌‌ జీ35 ప్రాసెసర్‌‌, 6,000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ వంటివి స్పెషాలిటీలు.

Tagged phones, Discounts, Prime Day, , Amazon

Latest Videos

Subscribe Now

More News