కాంగ్రెస్‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతల చేరికలపై చర్చ

కాంగ్రెస్‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతల చేరికలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ బుధవారం ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సమావేశం కానుంది. చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, సభ్యులు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సోమవారం ఈటల, డీకే అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి తరుణ్ చుగ్.. బీఎల్ సంతోష్ ను కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌‌ల నుంచి ఎవరెవరు బీజేపీలో చేరనున్నారనే జాబితాను వారు హైకమాండ్‌‌కు అందించారు. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు బుధవారం సమావేశం కావాలని హైకమాండ్ నిర్ణయించింది. త్వరలో పార్టీలో చేరేవారి పేర్లపై నిర్ణయం తీసుకోనున్నారు.