సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న దిశా పటానీకి.. ఇటీవల విడుదలైన ‘అవారాపన్ 2’ చిత్రం తన కెరీర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ఈ చిత్రం ‘బట్వారా 1947’ చిత్రం నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూ దేశవ్యాప్తంగా రూ.146 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ముందుకెళ్తోంది. ఈ సూపర్ హిట్‌తో అటు ఇమ్రాన్ హష్మీతో పాటు దిశా కెరీర్‌కు గొప్ప బూస్టప్ వచ్చినట్టయింది.
బాలీవుడ్‌లో దిశా పటానీకి సరైన సక్సెస్ వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోందంటే కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 2018లో వచ్చిన టైగర్ ష్రాఫ్ ‘బాఘీ 2’ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. ఆమె నటించిన భారత్, మలంగ్, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్, యోధా లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.
ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ యావరేజ్ గ్రాసర్‌గా నిలిచి కొంత ఊరటను ఇచ్చింది. ఇక ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్ బస్టర్ అయినా అందులో దిశ క్యారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటో తెలిసిందే.
వరుస పరాజయాలు పలకరిస్తున్నా తనదైన గ్లామర్ ట్రీట్, సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల్లో తన క్రేజ్ తగ్గకుండా కేర్ తీసుకుంటోంది దిశా పటానీ.. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న సక్సెస్ ‘అవారాపన్ 2’తో వచ్చింది. అంతేకాదు ఈ సినిమా విజయానికి తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ హెల్ప్ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సక్సెస్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందేమో చూడాలి!
