ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ గత వారం పది రోజులుగా ఈ పేరు వార్తల్లో బాగా నిలుస్తోంది. అడ్డదారుల్లో ఐఏఎస్ ఉద్యోగం సంపాధించిందని, అధికారదుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణ ఆమెపై రావడంతో అధికారులు బుధవారం పూజా ఖేడ్కర్ పై యాక్షన్ తీసుకున్నారు. ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ట్రెయినింగ్‌ను నిలిపేశారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం లాంటి ఆరోపణలతో పూజా ఖేడ్కర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్ చేస్తున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాల్లో ఆమె తనకు దృష్టి లోపం ఉన్నట్లుగా పేర్కొన్నారు. దాంతో ఆ అంశంపై దర్యాప్తు జరుగుతోంది.
