అవతార్ ది వే అఫ్ వాటర్ మూవీని ఫ్రీగానే చూడొచ్చు

అవతార్ ది వే అఫ్ వాటర్ మూవీని ఫ్రీగానే చూడొచ్చు

అవతార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ సినిమాని ఇక ఫ్రీగానే చూసేయొచ్చు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ మూవీ.. జూన్ 7 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈసారి ఆడియన్స్ కు ఫ్రీ గానే స్టీమ్ చేయనున్నట్టు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. కానీ అది పే రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తాజాగా.. రెంట్‌ చెల్లించకుండానే సినిమాని స్ట్రీమ్ చేయాలని డిస్నీ+హాట్‌స్టార్‌ నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరి థియేటర్లలలో వేల కోట్లు వసూళ్లతో వండర్‌ క్రియేట్ చేసిన అవతార్‌ మూవీ ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన  అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ మూవీ 2022 డిసెంబర్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా డిస్నీ+హాట్‌ స్టార్‌ ఎలాంటి రెంట్‌ లేకుండా స్ట్రీమింగ్ చేయనుంది.