పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెయిల్ పిటిషన్లను రెండు నెలల్లో పరిష్కరించండి

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెయిల్ పిటిషన్లను రెండు నెలల్లో  పరిష్కరించండి
  • హైకోర్టు, ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈ పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా, రెండు నెలల్లోపు పరిష్కరించాలని ట్రయల్ కోర్టు, హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మోసానికి సంబంధించిన కేసులో ఏడబ్ల్యూ భలేరావు తనకు బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టునుఆశ్రయించారు.

 ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో.. భలేరావు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తాజాగా జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన దరఖాస్తులను ఏండ్ల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచలేం. ఇలాంటి జాప్యాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) లక్ష్యాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ను ఉల్లంఘిస్తూ న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుంది’అని అభిప్రాయపడింది.