శంషాబాద్ మండలంలో బీసీ బంధు పంపిణీ

శంషాబాద్ మండలంలో బీసీ బంధు పంపిణీ

శంషాబాద్, వెలుగు:  శంషాబాద్ మండలంలోని ప్రజా పరిషత్ ఆఫీసులో సోమవారం బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​తో కలిసి జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్విరాజు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీ బంధును అమలు చేస్తున్నదన్నారు. 

ఈ స్కీమ్​ను అర్హులైన బీసీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, ఎంపీపీ నీలా మోహన్ నాయక్, మండల అధికారులు, గ్రామ సర్పంచ్​లు, ఎంపీటీసీలు, బీసీ బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.