కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ..

కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ..

దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి  విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానుంది.

హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం 5 లక్షల డోసులను ప్రజలకు పంపిణీ చేయనుంది. రెండు డోసులుగా కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నవారు బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇచ్చింది.  ఈ బూస్టర్ డోస్ లు  రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్ సీలు, యూపీహెచ్ సీల్లో అందుబాటులో ఉండనున్నాయి.