దళితులపై దాడి చేసినోళ్లను శిక్షించాలి : డీజీపీకి జి.చెన్నయ్య

దళితులపై దాడి చేసినోళ్లను శిక్షించాలి : డీజీపీకి జి.చెన్నయ్య
  • డీజీపీకి జి.చెన్నయ్య ఫిర్యాదు

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డీజీపీ శివధర్‌‌‌‌ రెడ్డికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఫిర్యాదు చేశారు. బాధితులతో కలిసి బుధవారం లక్డీకాపూల్‌‌లోని డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత, ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలోని మాలవాడలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దళితులపై గత నెల 15న అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. 

సర్పంచ్ ఎన్నికల్లో దళితులు పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేని, అగ్రకులాల వ్యక్తులు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపించారు. అడ్డుకోడానికి వెళ్లిన మహిళల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేస్తే.. స్టేషన్ బెయిలిచ్చి దాడి చేసిన వారిని విడుదల చేశారని చెప్పారు. బయటికొచ్చిన వాళ్లు ఇప్పుడు బాధితులను దూషిస్తూ, భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు.