ఫిబ్రవరిలో సెట్స్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ : చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

ఫిబ్రవరిలో సెట్స్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ : చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
  •     టీజీసీహెచ్‌‌‌‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టుల (సెట్స్) నోటిఫికేషన్లను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని టీజీసీహెచ్‌‌‌‌ఈ కార్యాలయంలో సెట్స్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ, షెడ్యూల్ ఖరారుపై చర్చించారు. 

ఇంటర్మీడియెట్ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ అయిన వెంటనే ఎప్‌‌‌‌సెట్ షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు.  ఈ నెలాఖ రు నుంచే వివిధ ప్రవేశపరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. 

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈసారి కూడా సెట్స్ నిర్వహణలో తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో టీజీసీహెచ్‌‌‌‌ఈ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఎప్‌‌‌‌సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి, వివిధ సెట్స్ కన్వీనర్లు ఏ.రవి, వెంకటేశ్వర్ రావు, విజయలక్ష్మి, రాజేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.