వర్సిటీల్లో భూదందాలా? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

వర్సిటీల్లో భూదందాలా? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యావ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్​ప్రభుత్వం నాశనం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘మొన్న ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారు. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకుపైగా అటవీ భూమిని తాకట్టుపెట్టి విధ్వంసం చేశారు. తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడింది’’ అని హరీశ్ మండిపడ్డారు.