హైదరాబాద్లో సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

 హైదరాబాద్లో సెప్టెంబర్ 2 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

గ్రేటర్ హైదరాబాద్ లో ఎంపిక చేసిన  12 వేల లబ్దిదారులకు 2023 సెప్టెంబర్ 2 తేదీన డబుల్ బెడ్ డ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  సెప్టెంబర్ 2 నుండి మొదటి విడుతలో  11 వేల 700 ఇళ్లను పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.  మొత్తం 5 లేదా 6 విదుతల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు పూర్తి చేస్తామని వెల్లడించారు.  ఇప్పటివరకు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా ..   మిగితా ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 

కుత్బుల్లాపూర్ లో మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్, శేర్లింగంపల్లిలో తలసాని, కొల్లూరులో హరీష్ రావు, మేడ్చల్ లో మల్లారెడ్డి, ఉప్పల్ లో మేయర్ విజయ లక్ష్మి,  ప్రతపసింగరంలో డిప్యూటీ స్పీకర్ పద్మ రావు గౌడ్,  మహేశ్వరం లో సబితా ఇంద్ర రెడ్డి, ఓల్డ్ సిటీ లో మహమూద్ అలీ, రాజేంద్ర నగర్ లో పట్నం  మహేందర్ రెడ్డి మొదటి విడత డబల్ బెడ్ రూమ్  ఇళ్ళ పంపిణీలో పాల్గొననున్నారు.