
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు బీబీపేట మండలం, జనగామకు చెందిన వ్యాపారి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి మంగళవారం బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. జీఆర్ కాలనీ, కౌండిన్య ఎన్‌క్లేవ్ ఏరియాల్లో నివసించే 100 మంది బాధితులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, నెల రోజులకు సరిపడా రూ. 3 వేల విలువైన నిత్యావసర వస్తువులు అందజేశారు. భారీ వరదల వల్ల ఇళ్లలో నీరు చేరి నష్టపోయిన కుటుంబాల బాధను తెలుసుకొని ఆయన సహకారం అందించారు.
పిల్లల పాఠ్యపుస్తకాలు కూడా పాడైనందున త్వరలో అందజేస్తామని ప్రతినిధులు తెలిపారు.