మరో రెండు వారాల్లో చేప పిల్లల పంపిణీ

మరో రెండు వారాల్లో చేప పిల్లల పంపిణీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మరో రెండు వారాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్లో సుమారు100 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ చేసేలా కసరత్తు చేస్తున్నారు. అందుకు రూ.90కోట్లు ఖర్చు చేయడానికి సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,700 చెరువులను జియో ట్యాగింగ్‌‌‌‌‌‌‌‌ చేసి చేపలపంపిణీ చేయనున్నారు. అనువైన చెరువులను సులువుగా గుర్తించి వాటిలో దశల వారీగా ఉచిత చేపల్ని విడుదల చేయనున్నారు.