ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ

 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ

ఆదిలాబాద్/మంచిర్యాల/ఆసిఫాబాద్/నిర్మల్​, వెలుగు​​: ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్, వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలు పంపిణీ చేశారు. వనమహోత్సవం నిర్వహించారు. మహనీయుల త్యాగాలు భావితరాలకు అందాలని వక్తలు సూచించారు. ఆదిలాబాద్​లో ఎస్పీ డి.ఉదయ్​ కుమార్​రెడ్డి స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్​, ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లలో ఫ్రీడమ్ పార్క్​లు ప్రారంభించారు. ఆసిఫాబాద్​జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.సురేశ్​ కుమార్​ మొక్కలు నాటారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)అచ్చేశ్వర్​రావు, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ సీఐ సుధాకర్, టౌన్ సీఐ రాణా ప్రతాప్  పాల్గొన్నారు. -నిర్మల్​లో ఎస్పీ ప్రవీణ్​కుమార్​ మొక్కలు నాటారు. ఎస్​బీ ఇన్​స్పెక్టర్​రమేశ్, ఆర్ఐలు హథిరాం, రమేశ్, రామకృష్ణ, డీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​మహేందర్​ పాల్గొన్నారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీస్ స్టేషన్​ ఆవరణలో మొక్కలు నాటారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, సీఐ నారాయణ, ట్రాఫిక్ సీఐ నరేశ్​కుమార్​ పాల్గొన్నారు. మందమర్రి పోలీస్​స్టేషన్​లో బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్​, సీఐ ప్రమోద్​రావు మొక్కలు నాటారు. క్యాతన్​పల్లి మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ, క్యాతన్​పల్లి, మందమర్రి కమిషనర్లు వెంకటనారాయణ, గద్దె రాజు, మందమర్రి ఎంపీడీవో శశికళ,  మాజీ జడ్పీటీసీ కంబగోని సుదర్శన్​గౌడ్​ పాల్గొన్నారు. జైపూర్​ఏసీపీ ఆఫీస్​ఆవరణలో మొక్కలు నాటారు.

ఏసీపీ నరేందర్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సైలు సుధాకర్, రామకృష్ణ సిబ్బంది  పాల్గొన్నారు. బాసర ట్రిపుల్​ఐటీలో ఆఫీసర్లు, విద్యార్థులు కలిసి క్యాంపస్​లో మొక్కలు నాటారు.  డైరెక్టర్ సతీశ్​కుమార్​ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఖానాపూర్ అర్బన్​పార్క్​లో అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు  మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎఫ్ డీ వో  కోటేశ్వర్ రావు, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ , సీఐ అజయ్ బాబు, ఎస్సై రజినీకాంత్, ఎఫ్ఆర్వో వినాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజుర సత్యం, కౌన్సిలర్లు ఖలిల్, షబ్బీర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ పాల్గొన్నారు. జన్నారంలో వనమహోత్సవం నిర్వహించారు. ఎఫ్ డీవో మాధవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన, పొనకల్, జన్నారం సర్పంచులు జక్కు భూమేశ్, బి.గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ నుంచి దండేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికుడి విగ్రహానికి పూలమాలవేసి జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ తీశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కల్ల మల్లారెడ్డి, లీడర్లు మున్నారాజ్ సిసోడియా, గోలి రాము, తమ్ముడి శ్రీనివాసరావు, తుల మధుసూదన్ రావు, ఆకుల అశోకవర్ధన్, పానుగంటి మధు, మిట్టపల్లి మొగిలి, బాణోత్ దాస్య, విజయ్ కుమార్, ఊట్ల సత్యనారాయణ, ముల్కల్ల తిరుపతిరెడ్డి, బొప్పు కిషన్,  కొండ నరేష్, కార్తీక్, ముత్తే అనిల్, ముత్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్​ఆధ్వర్యంలో బుధవారం ఆసిఫాబాద్​లో ‘హర్ ఘర్  తిరంగా’ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణకుమారి, కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి, విశాల్, రాధికా, నియోజకవర్గ ఇన్​చార్జి ఆత్మరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.