ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి : పృధ్వీరాజ్

ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి : పృధ్వీరాజ్

మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికలు సజావుగా జరగడానికి పొలిటికల్​ పార్టీల అభ్యర్థులు సహకరించాలని జిల్లా సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్​ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్,  వ్యయ పరిశీలకుడు సంజయ్ కుమార్,  జిల్లా పోలీస్ పరిశీలకుడు సంతోష్ కుమార్ తుకారాం, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్​ మాట్లాడుతూ..  ఎలక్షన్​ కమిషన్​ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని, రూ.10 వేల కంటే ఎక్కువ బ్యాంక్ నుంచి విత్​ డ్రా చేసుకోవద్దన్నారు. 

అభ్యర్థి  ఖర్చు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సంతోష్ కుమార్ తుకారాం మాట్లాడుతూ..  ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించేలా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సహకరించాలన్నారు. కలెక్టర్​ రాజర్షి షా మాట్లాడుతూ.. దాతలు చేసే  సహాయ సహకారాలు, ఎన్నికల ప్రచార ఖర్చులు అభ్యర్థి ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ నెల 18న రెండో ర్యాండమైజేషన్​ మెదక్​ ప్రభుత్వ జూనియర్ కాలేజ్​లో, నర్సాపూర్​లోని బీవీఆర్​ఐటీ  ఇంజనీరింగ్ కాలేజ్​లో నిర్వహిస్తున్నామన్నారు.  

ALSO READ: కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి : జాన్సన్​నాయక్

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారం కోసం కేవైసీ  (నో యువర్​ క్యాండిడేట్​) యాప్​లో తెలుసుకోవచ్చని సూచించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఎవరైనా  ప్రచారాన్ని అడ్డుకుంటే డయల్​100కు ఫోన్ చేయాలన్నారు .