శ్రీకృష్ణుడి చేయి విరిగింది.. హాస్పిటల్​లో కట్టు కట్టారు!

శ్రీకృష్ణుడి చేయి విరిగింది.. హాస్పిటల్​లో కట్టు కట్టారు!

ఆగ్రా: అవును మీరు చదివింది నిజమే. కృష్ణుడి విగ్రహానికి చేయి విరిగితే తల్లడిల్లిపోయిన పూజారి, ఆ విగ్రహాన్ని హాస్పిటల్​కు తీసుకువెళ్లాడు. అక్కడి సిబ్బంది కూడా ‘శ్రీకృష్ణ’ పేరుతో పేషెంట్​పేరు నమోదు చేసుకొని కట్టు కట్టి పంపించారు. ఈ సంఘటన ఆగ్రా జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన లేఖ్​సింగ్.. అర్జున్​నగర్ లోని ఓ టెంపుల్​లో 30 ఏండ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాడు. నిత్యపూజల్లో భాగంగా శుక్రవారం బాల గోపాలుడికి స్నానం చేయిస్తుంటే ఓ చేయి విరిగింది. దీంతో తల్లడిల్లిపోయిన లేఖ్​సింగ్​ వెంటనే హాస్పిటల్​కు తీసుకువెళ్లాడు. బాలగోపాలుడికి చేయి విరిగింది కట్టు కట్టాలని కోరగా.. స్టాఫ్​ అవాక్కయ్యారు.  పూజారి ఏడుస్తుండడంతో.. డాక్టర్లు చేయి విరిగిన విగ్రహానికి కట్టు కట్టారు. భక్తుడి మనోభవాలను కాదనలేక కట్టు కట్టినట్లు డాక్టర్లు చెప్పారు.