నాగపూర్‌‌‌‌ లో క్రికెట్ టోర్నమెంట్ షురూ

నాగపూర్‌‌‌‌ లో క్రికెట్ టోర్నమెంట్ షురూ

రేవల్లి, వెలుగు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ నిర్వహణకు పలువురు దాతలు స్వచ్ఛందంగా సహకారం ప్రకటించారు. 

ప్రథమ బహుమతిగా సుల్తాన్ అలీ రూ.20 వేలు, రెండో బహుమతిగా వేణుగోపాల్ రూ.15 వేలు, బాల్స్ మరియు షీల్డ్స్‌‌‌‌కు రూ.10 వేలు, క్రికెట్ బ్యాట్స్‌‌‌‌కు చెన్నకేశవులు రూ.10 వేలు, భోజన సౌకర్యాన్ని శ్రీనివాస్ రెడ్డి అందిస్తున్నారు. మొదటి రోజు నాగర్​కర్నూల్​, రేవల్లి జట్లు పోటీ  పడగా.. రేవల్లి జట్టు గెలుపొందింది.