
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య
రాయికోడ్, వెలుగు: అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్ కచుర రావు కోరారు. బుధవారం రాయికోడ్ లోని రైతువేదికలో తహసీల్దార్ ఆశాజ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో 160 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు రాక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.
మండల స్పెషల్ ఆఫీసర్ జగదీశ్ , తహసీల్దార్ ఆశాజ్యోతి ఆశాజ్యోతి, ఎంపీడీఓ షరీఫ్, ఏఎంసీ వైస్ చైర్మన్ వినయ్ ముదిరాజ్ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ ప్రభాకర్ రావు కులకర్ణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, మాజీ డీసీఏంఎస్ మాజీ చైర్మన్ సిద్దన్న పాటిల్, మండల నాయకులు బస్వరాజ్ పాటిల్, సుభాశ్ పాటిల్, సతీశ్, బస్వరాజ్ పాటిల్, ఎసప్ప, ప్రభాకర్, కేదారనాథ్ పాటిల్, జ్ఞానేశ్వర్, ఎండీ నజీర్ తదితరులు పాల్గొన్నారు.