రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి : జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్

రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి : జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్

ఆదిలాబాద్​ టౌన్/గుడిహత్నూర్, వెలుగు: జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సరిపడా ఎరువుల నిల్వలు ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ ​ఆదేశించారు. కలెక్టర్​ రాజర్షి షా, ట్రైనీ కలెక్టర్​ సలోనీతో కలిసి ఆదివారం గుడిహత్నూర్, బోథ్​మండలాల్లో పర్యటించారు. పీఏసీఎస్​ కేంద్రాలు, గోదాములను పరిశీలించారు. పీఏసీఎస్​ కేంద్రాల్లో అమలవుతున్న ఆన్‌లైన్ పేమెంట్ విధానం, ఎరువుల నిల్వలు, పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.

 అనంతరం బోథ్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి వార్డులను పరిశీలించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అడిషనల్ డీఎంహెచ్​వో మనోహర్, డీసీవో మోహన్, డీఏవో శ్రీధర్ స్వామి, తహసీల్దార్ కవితారెడ్డి, ఏవో భగత్‌ రమేశ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవ్‌ ముండే, సీఈవో పండరి తదితరులు పాల్గొన్నారు.