తాగునీటి ఎద్దడి నివారణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : సురేంద్రమోహన్

తాగునీటి ఎద్దడి నివారణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : సురేంద్రమోహన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి ఎద్దడి నివారణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా స్పెషల్​ ఆఫీసర్​ సురేంద్ర మోహన్​ ఆఫీసర్లను ఆదేశించారు. తాగునీటి ఎద్దడిపై కలెక్టరేట్​లో పలు శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్​ ప్రియాంక అల అధ్యక్షతన గురువారం మీటింగ్​ నిర్వహించారు. తాగు నీటి ఎద్దడిపై జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై  సురేంద్రమోహన్​ సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో తాగునీటికి తిప్పలు రావొద్దని సూచించారు. గుత్తికోయల గ్రామాల్లో ప్రజలు చలిమ నీళ్లు తాగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్లాన్​ చేయాలని సూచించారు. దీనికి ఫారెస్ట్​ ఆఫీసర్లు సహకరించాలన్నారు. తాగునీటి సమస్యలున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్డీవో విద్యాచందన, మిషన్​ భగీరథ సీఈ కే. శ్రీనివాసరావు, ఎస్ఈ సదాశివకుమార్, ఈఈ తిరుమలేశ్, ఇరిగేషన్​ ఎస్ఈ శ్రీనివాస్​రెడ్డి, పబ్లిక్​ హెల్త్​ ఈఈ రంజిత్, జడ్పీ సీఈవో ప్రసూన రాణి, భూగర్భ జల శాఖాధికారి బాలు, డీపీవో చంద్రమౌళి, మున్సిపల్​ కమిషనర్లు పాల్గొన్నారు.