గ్రేటర్ హైదరాబాద్ లో జిల్లాల వారీగా ఓటర్లు ఇలా..

గ్రేటర్ హైదరాబాద్ లో  జిల్లాల వారీగా ఓటర్లు ఇలా..

గ్రేటర్​హైదరాబాద్​లో నయా రికార్డు నమోదైంది. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఓటర్ల సంఖ్య కోటి దాటింది. లోక్​సభ ఎన్నికలకు ముందు ఓటర్లు పెరగడం మంచి పరిణామం అని అధికారులు చెబుతున్నారు. 2024 ప్రత్యేక సవరణ ఓటరు జాబితా ప్రకారం గ్రేటర్ లో 1,00,36,605 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 

ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 23,30,574 మంది, మహిళలు 22,39,240 మంది, ఇతరులు 324 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 22,17,717 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 11,46,854, మహిళలు 10,70,533, ఇతరులు 498 మంది ఉన్నారు. గ్రేటర్​పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో మొత్తం 28,41,331 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు14,73,621 మంది, 13,67,289 మహిళలు, ఇతరులు 421 మంది ఉన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,07,419 మంది ఉండగా, ఇందులో పురుషులు 2,09,757మంది, మహిళలు 1,97,577, ఇతరులు 85 మంది ఉన్నారు.