V6 News

మందమర్రిలోని కన్నులపండువగా శ్రీనివాసుడి కల్యాణం

మందమర్రిలోని కన్నులపండువగా  శ్రీనివాసుడి కల్యాణం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీనివాసుడి కల్యాణాన్ని కన్నులపండువగా జరిపారు. వేదపండితులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, నరసింహాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించి కల్యాణోత్సవంలో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ–శ్రీవాణి దంపతులు పాల్గొని పూజలు చేశారు. 

గత రెండు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయం హోమాది కార్యక్రమాలు చేపట్టారు.