శిశు ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా IIPH-H తో దివీస్ ఫౌండేషన్ ఒప్పందం

శిశు ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా IIPH-H తో దివీస్ ఫౌండేషన్ ఒప్పందం

బాలల ఆరోగ్యాన్ని పెంచి, వారి మానసిక అభివృద్ధి, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ సంస్థ.. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  (IIPH-H) తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దివీస్ ఫౌండేషన్‌కు ఆధ్వర్యంలో నడుస్తున్న వర్ణం చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఈ ఒప్పందం అమలు కానుంది. 

గురువారం (అక్టోబర్ 30) దివీస్ ఫౌండేషన్ తరఫున ఆ సంస్థ అధ్యక్షుడు డా. ప్రమోద్ గడ్డం, IIPH-H తరఫున ఆ సంస్థ డీన్ డా. రాజన్ శుక్లా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. శిశువుల్లో ఎదుగుదల ఆలస్యం, న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్లను (NDDs) ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోనున్నారు.

ప్రధాన మంత్రి వికసిత్  భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి చిన్నారికి సమయానుకూలంగా ఎదుగుదలకు కావాల్సిన సహాయం అందేలా చేయడం కోసం ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి.  ACCESS హెల్త్ ఇంటర్నేషనల్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ల (DEIC) ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభించారు.  అక్టోబర్ 29, 30, తేదీల్లో హైదరాబాద్‌లోని వర్ణం చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జరిగిన రెండు రోజుల వర్క్‌షాప్‌లో కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల DEIC నిపుణులు పాల్గొన్నారు.

IIPH , వర్ణం సెంటర్ ఫ్యాకల్టీ బృందాల ఆధ్వర్యంలో కేర్ ప్లానింగ్ కు సంబంధించి శిక్షణ ఇచ్చారు. శిశు అభివృద్ధి గుర్తించడం, టీం వర్క్ ను ప్రోత్సహించడం, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఈ వర్క్‌షాప్ కీలక పాత్ర పోషించింది.

IIPH హైదరాబాద్, దివీస్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్, ACCESS హెల్త్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా శిశు ఆరోగ్యం, అభివృద్ధి కోసం సమగ్ర వ్యవస్థను ఏర్పరచేందుకు కట్టుబడి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించి, ప్రతి చిన్నారి తన అభివృద్ధి సామర్థ్యాన్ని సాకారం చేసుకునేలా చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.