
కార్తీక మాసం చివరి రోజుతో పాటు… ఆఖరి సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించి, తలనీలాలు సమర్పిస్తున్నారు.