దీపావళి వేళ.. జాగ్రత్త ఇలా.. పటాకులు కాల్చేప్పుడు కంటిలో ఏదైనా పడితే ఇలా చేయండి !

దీపావళి వేళ.. జాగ్రత్త ఇలా.. పటాకులు కాల్చేప్పుడు కంటిలో ఏదైనా పడితే ఇలా చేయండి !

హైదరాబాద్ సిటీ, వెలుగు: దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు మన అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. గాయాలతో పాటు అతి ముఖ్యమైన కండ్లు కూడా పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్‌‌‌‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్​ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్​చార్జి డాక్టర్ నవ్యా చెరుకూరి,  మెడికవర్ హాస్పిటల్స్‌‌‌‌ సీనియర్ కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ హరినాథ్ బాబు సూచిస్తున్నారు.

ఇలా చేయండి
* పటాకులు కాల్చేప్పుడు కంటిలో ఏదైనా పడితే శుభ్రమైన నీరు, సెలైన్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. 
* వీలైనంత వరకు శుభ్రంగా, పొడిగాఉండే వస్త్రం కంటిపై కప్పాలి. గాయం పెద్దది కాకుండా ఉండాలంటే కంటిని మూసి ఉంచాలి.  గాయపడిన కంటిపై ఒత్తిడి పెట్టకూడదు. తుడవడం, మర్దన చేయడం లాంటివి వద్దు. ఇది గాయాన్ని తీవ్రతరం చేస్తుంది. 
* ఇంట్లో ఉన్న మెడిసిన్స్, ఆయిట్మెంట్స్, క్రీములు యూజ్​చేయొద్దు. గాయపడిన వ్యక్తిని వెంటనే డాక్టర్​దగ్గరకు తీసుకువెళ్లాలి.  
* కంట్లో ఏదైనా పడితే దానిని తీయడానికి ప్రయత్నం చేయొద్దు. 
* గాయపడిన వ్యక్తికి వైద్య సేవలు అవసరమైతే స్వయంగా డ్రైవ్ చేయకుండా ఇతరుల సాయంతో హాస్పిటల్​కు వెళ్లాలి.  
* పటాకులకు గ్యాస్ సిలిండర్లు, నూనె పదార్థాలకు దూరంగా ఉంచాలి. పటాకులు ఖాళీ ప్రదేశాల్లోనే కాల్చాలి. 
* పటాకులు వెలిగించడానికి పొడవైన అగరబత్తులు ఉపయోగించాలి. దగ్గరలో రెండు బకెట్ల నీరుఉంచుకోవాలి. 
* తీవ్రమైన గాయాలైతే శుభ్రమైన బెడ్ షీట్ కప్పి దవాఖానకు తీసుకు వెళ్లాలి.
* భారీ గాలులు వీచేప్పుడు కాల్చకుండా ఉంటేనే మంచిది. 
* పటాకులు కాల్చేప్పుడు కళ్లద్దాలు పెట్టుకుంటే ప్రమాదాల నుంచి కండ్లను రక్షించుకునే అవకాశం ఉంటుంది. 
* పటాకులు వెలిగించే స్థలం నుంచి కనీసం 5 మీటర్ల దూరం ఉండాలి. 
* పిల్లలను ఒంటరిగా పటాకులు కాల్చనివ్వొద్దు. 
* పటాకులు కాల్చిన తర్వాత గన్ పౌడర్ లేదా ఇతర కెమికల్స్​చేతుల్లో ఉంటాయి. ఇవి కళ్లలోకి వెళితే ప్రమాదం.. కళ్లకు తాకేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కండ్లలో కెమికల్స్​పడితే చేతితో రుద్దకుండా దవాఖానకు వెళ్లాలి.
* అత్యవసరమైతే ఎల్‌‌‌‌వీ ప్రసాద్ హాస్పిటల్​హెల్ప్‌‌‌‌లైన్ నెంబర్లకు 040-68102100, 040-68102848, 73311 29653 కాల్​చేయవచ్చు.