దీపావళి స్పెషల్: ఈసారి 40% వరకు లాభాలను ఇచ్చే 19 షేర్స్ ఇవే!

 దీపావళి స్పెషల్: ఈసారి 40% వరకు లాభాలను ఇచ్చే 19 షేర్స్ ఇవే!

దీపావళి పండుగ అంటేనే దీపాల వెలుగులు.. ఈ దీపాలతో మీ ఇంటిని వెలిగించినట్టే డబ్బు పెట్టుబడి పెట్టేవాళ్ళ పోర్ట్‌ఫోలియోలను కూడా ప్రకాశవంతం చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు.  ఎందుకంటే మన దేశ సంప్రదాయంలో దీపావళిని "శుభప్రదానికి, మంచికి, లాభం ఇచ్చేది" అని భావిస్తారు. అందుకే ఈ రోజున కొనుగోళ్లు, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్‌లో షేర్స్ కొనడం వల్ల అదృష్టం, సంతోషం కలుగుతుందని నమ్మకం. ఈ సందర్భంగా పెట్టుబడిదారులు samvat 2082 (కొత్త సంవత్సరం)లోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ 19 స్టాక్‌ల లిస్ట్ వారి పోర్ట్‌ఫోలియోలను కాంతివంతం చేయడానికి గొప్ప అవకాశం ఇస్తుంది.  

నిపుణుల సూచన, అంచనా ప్రకారం  ఈ స్టాక్స్ వచ్చే దీపావళి నాటికి 40% వరకు లాభాలు ఇవ్వవచ్చు. ఆటోమొబైల్స్, FMCG, డిఫెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ముఖ్య రంగాలపై దృష్టి పెడుతూ ఈ లిస్ట్ పెట్టుబడిదారులకు రిస్క్‌ బ్యాలెన్స్ చేస్తూ మంచి లాభాలు సంపాదించే మార్గాన్ని చూపిస్తుంది. 


2025 దీపావళి  టాప్ 19 స్టాక్స్‌:

స్మాల్-క్యాప్ స్టాక్స్:

Va Tech Wabag Limited: ఈ స్టాక్  ధర రూ.1,770 నుండి రూ.1,900 వరకు పెరిగి, ఏకంగా 25% లాభాన్ని ఇవ్వొచ్చు. 

Fiem Industries Limited shares: ఇది కూడా 27% లాభంతో రూ.2,450 దాకా చేరుకోగలదని అంటున్నారు.

BlackBuck: ఈ స్టాక్ ధర రూ.860 దాటి, 28% లాభాన్ని ఇస్తుందని అంచనా.

Graphite India Limited: ఇది రూ.650 వద్ద గట్టిగా నిలబడగలదని నువామా సంస్థ తెలిపింది.

Royal Orchid Hotels: ఈ హోటల్ స్టాక్ ధర  24 నెలల్లో రూ.700 చేరుకుని, 40% కంటే ఎక్కువ రాబడి ఇవ్వగలదని వెంచురా సెక్యూరిటీస్ ధీమాగా ఉంది.

MSTC LTD shares: ప్రస్తుత ధర రూ.673 వద్ద ఉన్న ఈ స్టాక్ 26% లాభాన్ని ఇస్తుందని HDFC సెక్యూరిటీస్ నమ్ముతోంది.

Subros Limited: ఈ స్టాక్ ధర రూ.1,355 టార్గెట్ చేరుకుని, 34.4% లాభం ఇవ్వగలదని SBI సెక్యూరిటీస్ చెప్పింది.

Doms Industries Ltd : నోట్ బుక్స్, పెన్సిల్స్ తయారీలో ఉన్న ఈ స్టాక్ ధర రూ.3,085 వరకు పెరిగి, దాదాపు 24.4% నుండి 22% లాభాలు ఇస్తుందని ప్రభుదాస్ లీలాధర్ తెలిపారు.

Skipper Limited: ఈ స్టాక్ ధర రూ.685 వద్ద 36% లాభం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఏంజెల్ వన్ అంచనా వేసింది.

Ganesha Ecosphere Ltd: ఈ స్టాక్ ధర రూ.1,490 చేరుకుని, 23.6% లాభాన్ని ఇస్తుందని ఆశికా గ్రూప్ తెలిపింది.

 లార్జ్-క్యాప్ స్టాక్స్ :

Hindustan Aeronautics Limited(HAL): డిఫెన్స్  రంగంలో ఈ పెద్ద స్టాక్ ధర రూ.5,500 వరకు పెరిగి, 15.9% రాబడి ఇస్తుందని ప్రభుదాస్ లీలాధర్ చెప్పింది.

ICICI Bank: ఈ ప్రైవేట్ బ్యాంకు స్టాక్ ధర రూ.1,730 టార్గెట్ చేరుకుని, 25.4% లాభం ఇవ్వగలదు.

ITC: ఈ స్టాక్ ధర రూ.530 వరకు పెరిగి, ఏకంగా 32.8% లాభాన్ని ఇస్తుందని ప్రభుదాస్ లీలాధర్ అంచనా.

State Bank of India (SBI): ఈ స్టాక్ ధర రూ.960  వద్ద 8.7% లాభం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

Apollo Hospitals: ఈ ఆసుపత్రి స్టాక్ ధర రూ.9,300 చేరుకుని, 18% లాభం ఇస్తుందని నమ్ముతున్నారు.

Britannia Industries: ఈ ఆహార సంస్థ స్టాక్ ధర రూ.6,484 టార్గెట్ తో, 10.5% లాభం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

 మిడ్-క్యాప్ స్టాక్స్:

Eris Lifesciences: ఈ ఫార్మా స్టాక్ ధర రూ.1,975తో  22.7% లాభాన్ని ఇస్తుందని ప్రభుదాస్ లీలాధర్ చెప్పింది.

KEI Industries: ఈ స్టాక్ ధర రూ.4,946 టార్గెట్ తో 14.7% మంచి లాభం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

Doms Industries Limited:   ఈ స్టాక్ ధర రూ.3,085తో 22% లాభం  ఇస్తుందని అంచనా. 


ఈ 19 స్టాక్‌లు సుమారు ఒక సంవత్సరం కాలంలో మంచి పురోగతి సాధించి, పెట్టుబడిదారులకు గొప్ప లాభాలను ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థలు నమ్ముతున్నాయి.  అయితే ఇది కేవలం బ్రోకరేజ్ సంస్థల అంచనాల సమాచారం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ సొంత ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.