
ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 20 వ తేదీ .. దీపావళి రోజు లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవితో పాటు వినాయకుడు, కుబేరులను కూడా పూజిస్తారు. ఈ రోజున చేసే పూజ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుందని పండితులు చెబుతున్నారు. దీపావళి నాడు ఎన్ని దీపాలు వెలిగించాలి? ఏ దిశలో వెలిగించాలి? ఏదీపం ప్రాముఖ్యత ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
దీపావళి పండుగ దీపాల పండుగ. పెద్దలకన్నా పిల్లలు ఇష్టపడే లైట్స్ ఫెస్టివల్. దీపావళి పండుగ రోజు ఇళ్లు దీపాల వెలుగులో కళకళలాడిపోతాయి, రంగు రంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి. దాదాపు ఇల్లంతా దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయి.
నిజానికి దీపావళి నాడు వెలిగించిన దీపాల లెక్క ఒకటుంది. ఆచారాలు, నమ్మకాల ప్రకారం వెలిగించాల్సిన దీపాలు వెలిగించాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. . దీపావళి నాడు మీ ఇంటి ముందు 13 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఆ పదమూడు దీపాలను ఎక్కడపడితే అక్కడ వెలిగించకూడదు. అవి పెట్టే ప్రదేశాలను బట్టి ఆ ఇంటికి జరిగే శుభాలు ఆధారపడి ఉంటుంది.
దీపాలను ఎక్కడ పెట్టాలి..?
- మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త వేసే దగ్గర (డస్ట్ బిన్) దక్షిణం వైపు ఉంచాలి.
- రెండో దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే దీపం. దీన్ని మీ పూజ మందిరం ముందు ఉంచాలి. ఇందులో మూడు వత్తులు ఉండాలి. అందులో ఒకటి కుంభ ఒత్తి ఉండాలి.
- మూడో దీపం మీ కుటుంబ శ్రేయస్సు, సమృద్ధి కోసం. లక్ష్మీ దేవి ఆశీర్వాదం కోసం ఈ మూడో దీపం. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి.
- నాలుగో దీపం మీ ఇంట్లో శాంతిని, సంతోషాన్ని నింపేది. దీన్ని తులసి మొక్క ముందు ఉంచాలి.
- అయిదో దీపం మీ ఇంట్లోకి ఆనందాన్ని,ప్రేమను స్వాగతిస్తుంది. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి.
- ఆరో దీపాన్ని ఆవనూనెతో వెలిగిస్తే మంచిది. ఇది చాలా శుభప్రదమైనది. ఈ దీపం మీ ఇంట్లోని ఆర్ధిక సంక్షోభాలను, అనారోగ్యాలను దూరం చేస్తుంది. కీర్తి, సంపదను తెచ్చి పెడుతుంది. అందుకే ఈ దీపాన్ని రావి చెట్టు ముందు ఉంచాలి. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.
- ఇక ఏడో దీపాన్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం ముందు వెలిగించాలి.
- ఎనిమిదో దీపాన్ని మీరు చెత్త పడేసే ప్రదేశం వద్ద వెలిగించాలి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలంటే తొమ్మిదో దీపాన్ని మీ బాత్రూమ్ గుమ్మాల వద్ద వెలిగించాలి.
- తొమ్మిదవ దియా ఇంటి చుట్టూ సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి ఇంటి వాష్‌రూమ్ వెలుపల ఉంచాలి
- ఇక పదో దీపం ఇంటి రక్షణకు సంబంధించినది. దీన్నీ ఇంటి పై కప్పు కోసం కాస్త ఎత్తులో పెట్టాలి.
- పదకొండవ దీపం ఉత్సాహం, చురుకుదనాన్ని సూచిస్తుంది.ఇంట్లోని వారందరూ అలా ఉండాలంటే పదకొండో దీపాన్ని కిటికీ వద్ద వెలిగించాలి.
- పండుగ స్పూర్తిని తెలిపేది పన్నెండవ దీపం. ఇది అందరికీ కనిపించేలా వెలిగించాలి. ఇంటి టెర్రస్ లేదా రూఫ్ టాప్ మీద వెలిగించాలి.
- పదమూడో దీపాన్ని మీ ఇంటికి వెళ్ల దారిలో ఎక్కడైనా వెలిగించండి..
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అలా అని అన్ని దీపాలు వరుసగా పెట్టమని కాదు. ఇలా పదమూడు దీపాలను వెలిగిస్తే మీ ఇల్లు సుఖసంతోషాలతో, భోగాభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లుతుందని పండితులు చెబుతున్నారు. దీపాలను కేవలం ప్రమిదల్లోనే వెలిగించాలి.
ఈ పదమూడు దీపాలను ఇంటి వద్ద వెలిగించడం అనేది అంతే శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా పదమూడు దీపాలను వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని చెబుతున్నారు. దీపాలు వెలిగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కూడా పండితులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తులు తీసుకోవాలని తెలిపారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని .. ఆధ్యాత్మిక వేత్తల సలహాలతో పాటు.. పురాణాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.