
హైదరాబాద్, వెలుగు: మినర్వా స్వీట్స్ ఈ దీపావళికి ప్రత్యేక గిఫ్టింగ్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. భారతదేశం అంతటా, అంతర్జాతీయంగా కొరియర్ ద్వారా వీటిని డెలివరీ చేస్తోంది. ఈ ప్యాకేజీల్లో ప్రీమియం స్వీట్స్, నమకీన్, డ్రై ఫ్రూట్స్, దీపావళి స్పెషల్ గుడీస్ ఉన్నాయి.
ఇవి కుటుంబం, స్నేహితులు, కార్పొరేట్ గిఫ్టింగ్‌కి సరిపోతాయని మినర్వా స్వీట్స్ పేర్కొంది. “హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వరకు ఉన్న మా కస్టమర్లు తమ ప్రియమైనవారితో పండుగ ఆనందాన్ని సులభంగా పంచుకోవాలి. అందుకే గిఫ్టింగ్ ప్యాకేజీని తీసుకొచ్చాం” అని మినర్వా ప్రతినిధి అరీఫ్ హిరానీ అన్నారు.