దీపావళి అంటే.. వెలుగుల దివ్వెలు... స్వీట్లు.. పసిడి కాంతులే కాదు.. ఆకర్షణీయమైన గిఫ్టులు కూడా. కుటుంబసభ్యులకు, బంధువులకు గిఫ్టులు ఇవ్వడం సంప్రదాయం. అందుకే గిప్టులకు ప్రత్యేక స్థానం. ఈ దీపావళికి మదిని దోచే గిప్టు ఐడియాలు మీకోసం...
బంగారు ఆభరణాలు : వీటిని ఇష్టపడనివాళ్లు ఎవరూ ఉండరు. పైగా పండుగకు బంగారం కొనడం కూడా సంప్రదాయం. కాబట్టి ఇష్టమైనవాళ్లకు బంగారు ఆభరణాలతో కూడిన గిఫ్టులు ఇస్తే.. ఆనందాన్ని రెట్టింపు చేయొచ్చు. నెక్లెస్, బ్రాస్ లెట్, బ్యాంగిల్స్, వజ్రాలు.. లాంటివి ఇవ్వొచ్చు. అయితే బడ్జెట్ బట్టి గిఫ్టులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
హోమ్ మేడ్ గిఫ్ట్స్ : సాధారణంగా పండుగ గిప్టులు అనగానే మార్కెట్లో కొనో, ఆన్ లూన్ లో తెప్పించో ఇస్తుంటారు చాలామంది. ఇలా కాకుండా సొంతంగా కుటుంబసభ్యులు ఎలాంటి తీపే పదార్థాలు ఇష్టపడతారో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇంట్లోనే చాక్లెట్లు, స్వీట్లు తయారు చేసి ఆకర్షణీయమైన గిప్ట్ బాక్స్‌లో పెట్టి ఇస్తే బాగుంటుంది. వీటితోపాటు గణేష్, లక్ష్మి దేవతామూర్తుల ప్రతిమలనూ ఇవ్వొచ్చు.
నోరూరించే స్వీట్లు : పండుగ ఏదైనా సరే.. తీపి వంటకాలు ఉం డాల్సిందే. స్వీట్ షాపుల్లోకి వెళ్లి ఇష్టమైన స్వీట్స్ గిఫ్ట్‌గా ఇవ్వడం కామన్. రోటీన్ కు భిన్నంగా ఒకే రకమైనవి కాకుండా రకరకాల స్వీట్లను అందమైన బాక్సులో నింపిస్తే బాగుంటుంది.
ALSO READ : ధన త్రయోదశి 2025: యమ దీపం ఎప్పుడు పెట్టాలి..
పుస్తకాలు : బెస్ట్ గిఫ్ట్ ఐటమ్స్ లో పుస్తకాలు ఎప్పుడూ ముందుంటాయి. ఏ జనరేషన్ అయినా పుస్తకా లు చదవడానికి ఇష్టపడతారు. ఈ దీపావళికి పుస్తకాలు కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. అయితే వయసునుబట్టి ఇష్టాయిష్టాలను బట్టి పుస్తకాలను గిఫ్టులుగా ఇస్తే బాగుంటుంది. పిల్లలకు రైమ్స్ బుక్స్ తోపాటు పొయెట్రీ పుస్తకాలు ఇవ్వడం వల్ల సాహిత్య భావాలు పెంపొందుతాయి. ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అలవాటు ఉంటాయి. కొందరికి పెయింటింగ్ మరికొందరికి రెసిపీ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ల అసక్తిని బట్టి గిప్టులు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
డ్రైఫ్రూట్స్ : బెస్ట్ దీపావళి గిఫ్ట్ ఇది స్వీట్లకు బదులు వీటిని ఇవ్వడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. డ్రైఫ్రూట్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధకశక్తిని పెంచడంతోపాటు బరువును తగ్గిస్తాయి.
దేవుళ్ల ప్రతిమలు : కుటుంబసభ్యుల్లో ఆత్మీయుల్లో పెద్దవాళ్లు కూడా ఉంటారు. వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి గిఫ్టులు ఇవ్వాలి. సాధారణంగా పెద్దవాళ్లు స్వీట్లు, ఇతర గిప్టులు తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ల అబభిరుచులేంటో తెలుసుకోవాలి. చాలా మంది దేవుడి ప్రతిమలు తీసుకోవ డానికి ఇష్టపడతారు. చిన్న సైజులో వెండి లేదా బంగారంతో కూడిన ప్రతిమలు ఇస్తే బాగుంటుంది. లార్డ్ గణేషా, తిరుపతి వేంకటేశ్వరస్వామి, లక్ష్మి దేవికి సంబంధించిన చిన్నపాటి విగ్రహాలను అందిస్తే మరింత ఆనందిస్తారు.
బంగారు, వెండి నాణేలు: బంగారు... వెండి ఆభరణాలు కొనాలంటే ఖర్చుతో కూడు కున్న పని. అందుకు బదులుగా బంగారు.. వెండి నాణేలను గిఫ్టుగా ఇస్తే సౌకర్యవంతంగా ఇంటుంది. లక్ష్మీ దేవత ప్రతిమ-లతో కూడిన నాణేలు ఇస్తే బాగుంటుంది.కొన్ని కుటుంబాల్లో ఈ రకమైన గిఫ్టులకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వారసత్వంగా కూడా ఇలాంటి గిఫ్టులు ఇస్తుంటారు.
