
దీపావళి (అక్టోబర్20 ) పండగను హిందువులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఈ దీపావళి పండగను కొన్ని ప్రాంతాల వారు ఐదు రోజులు జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా మొదటి రోజుని ధన త్రయోదశిగా ( October 18) జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున యమ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వలన యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ ఏడాది ఎప్పుడు యమ దీపం వెలిగించాలి? నియమాలు తెలుసుకుందాం..
ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని కృషఫపక్షంలో అంటే కృష్ణ పక్షంలోని పదమూడవ రోజున యమ దీపం వెలిగిస్తారు. మరణానికి అధిపతి అయిన యమ ధర్మ రాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం గా ఉంటారని చెబుతారు.
ధన త్రయోదశి తిథి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 18వ తేదీ శనివారం ధన త్రయోదశిని జరుపుకుంటారు. కాబట్టి అదే రోజు యమ దీపం వెలిగించాలి.
ALSO READ : దీవెనల దీపావళి.. పూర్వకాలంలో ఎవరు హారతి ఇచ్చేవారో తెలుసా..!
దీపం వెలిగించడానికి దిశ యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. దక్షిణ దిశను యమ ధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు. అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు.
యమ దీపం వెలిగించడానికి నియమాలు
- యమ దీపం నాలుగు వైపులా ఉండాలి.. నాలుగు వత్తులతో వెలిగించాలి.
- యమ దీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి.
- దీపం వెలిగించిన తర్వాత.. దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి
- దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో జీవించాలని..అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి.
- యమ దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి
- ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయని, అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు.