బిగ్​సీలో దీపావళి ఆఫర్లు.. ప్రతి స్మార్ట్‌‌‌‌ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌

బిగ్​సీలో దీపావళి ఆఫర్లు.. ప్రతి స్మార్ట్‌‌‌‌ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్లను అమ్మే  బిగ్‌‌‌‌ సీ దీపావళి ఆఫర్లను ప్రకటించింది.  ప్రతి స్మార్ట్‌‌‌‌ఫోన్ కొనుగోలుపై రూ.10 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌  ఇస్తోంది. అంతేకాకుండా రూ.4 వేల విలువైన బహుమతిని కచ్చితంగా ఇస్తామని బిగ్‌‌‌‌ సీ ఎండీ యం బాలు చౌదరి పేర్కొన్నారు.  వీటితో పాటు స్మార్ట్ వాచ్ ఆఫర్‌‌‌‌‌‌‌‌, లాయల్టీ పాయింట్స్‌‌‌‌ ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్‌‌‌‌‌‌‌‌, 1+1 ఎక్స్‌‌‌‌టెండెడ్‌‌‌‌ వారంటీ ఆఫర్‌‌‌‌‌‌‌‌ వంటివి కూడా అందిస్తున్నామని  అన్నారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్స్ కొనుగోలు చేస్తే రూ.9 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నామని బిగ్‌‌‌‌ సీ ప్రకటించింది.

ఎస్‌‌‌‌బీఐ ద్వారా ప్రతి మొబైల్‌‌‌‌ లేదా స్మార్ట్ టీవీ, ల్యాప్‌‌‌‌టాప్ కొనుగోలు చేస్తే రూ.3 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌ను, ఐడీఎఫ్‌‌‌‌సీ ద్వారా కొంటే రూ.7,500 వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌ను ఇస్తున్నామని వెల్లడించింది. కొన్ని మొబైల్స్‌‌‌‌ కొనుగోలుపై రూ.5 వేల విలువైన ఫైర్ బోల్డ్ స్మార్ట్ వాచ్‌‌‌‌ను కేవలం రూ.500 కి అమ్ముతోంది. ప్రతి స్మార్ట్‌‌‌‌ టీవీ కొనుగోలుపై ఒక కచ్చితమైన బహుమతితో పాటు రూ.5,200 విలువైన ఫింగర్స్ బార్ స్పీకర్లను రూ.2,500 కే అమ్ముతోంది.  ఐఫోన్ మొబైల్స్ కొనుగోలుపై రూ.7 వేల వరకు బెనిఫిట్స్ పొందొచ్చని బిగ్ సీ వెల్లడించింది. రూ.10‌‌‌‌ వేల విలువైనఫైర్ బోల్ట్‌‌‌‌ స్మార్ట్ వాచ్‌‌‌‌ జోడీ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను కేవలం రూ.2 వేలకే అమ్ముతున్నామని తెలిపింది. బ్రాండ్ యాక్సెసరీలపై 51 శాతం వరకు డిస్కౌంట్‌‌‌‌ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ రాష్ట్రాల్లో బిగ్‌‌ సీ కి 250 కి పైగా స్టోర్లు ఉన్నాయి.