ఈ దీపావళికి కొనాల్సిన 5 షేర్స్ ఇవే.. లాభాల పంట పండినట్లే.. నిపుణులు ఏమంటున్నారంటే..?

 ఈ దీపావళికి కొనాల్సిన 5 షేర్స్ ఇవే.. లాభాల పంట పండినట్లే.. నిపుణులు  ఏమంటున్నారంటే..?

దీపావళి పండగ వచ్చేసింది, ఈ దీపాల పండగ సందర్భంగా మీ స్టాక్స్ పోర్ట్‌ఫోలియోని వెలుగులతో నింపే ఐదు స్టాక్స్ గురించి  ఈక్విటీ  బ్రోకింగ్ హైలైట్ చేసింది. బ్రోకరేజ్ సంస్థ ఈ స్టాక్‌లకు కొనుగోలు(buy) రేటింగ్ కూడా ఇచ్చింది, ఇవి మంచి లాభాలను చూస్తాయని అంచనా వేయగా... ఈ 5 స్టాక్‌ల ప్రస్తుత ధర, టార్గెట్ ధర ధరల గురించి మీకోసం... 

 28,000కి చేరుకోనున్న నిఫ్టీ: వచ్చే దీపావళి 2026 నాటికి నిఫ్టీ 26,500 నుండి 28,000 స్థాయిని తాకుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. ఈ పండుగ సీజన్‌లో కొనాల్సిన బలమైన ఐదు స్టాక్‌ల గురించి  బ్రోకరేజ్ సంస్థ పెట్టుబడిదారులకు సూచించింది. వీటిలో ఫెడరల్ బ్యాంక్, సిప్లా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), అశోక్ లేలాండ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఉన్నాయి. 


ఫెడరల్ బ్యాంక్ షేర్: దీపావళి ప్రత్యేక స్టాక్‌ల లిస్టులో ఫెడరల్ బ్యాంక్ మొదటి స్థానంలో ఉంది. గత గురువారం షేర్ ధర 214 వద్ద ముగిసింది. అయితే బ్రోకరేజ్ సంస్థ దీనికి రూ.245 నుండి రూ.255 కొత్త టార్గెట్ ధరని ఇస్తోంది.  కొనుగోలు(buy) రేటింగ్‌ కూడా జారీ చేసి పెట్టుబడిదారులను కొనుగోలు చేయమని సూచించారు. ఫెడరల్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.52 వేల 760 కోట్లు. గత ఐదు సంవత్సరాలలో 310% రాబడిని అందించింది. 


సిప్లా షేర్: బ్రోకరేజ్ సంస్థ లిస్ట్ చేసిన మరో స్టాక్ ఫార్మా దిగ్గజం సిప్లా. గత ట్రేడింగ్ రోజున షేర్ ధర రూ.1,570 వద్ద ముగిసింది. ఛాయిస్ బ్రోకింగ్ దీనికి బై రేటింగ్ ఇచ్చింది, కొత్త టార్గెట్ ధర రూ.1,770 నుండి రూ.1,850. దీని మార్కెట్ క్యాప్ రూ.1.27 లక్షల కోట్లు. అలాగే ఐదు సంవత్సరాలలో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసింది. 

BDL షేర్: ఈ లిస్టులో ఇంకొక స్టాక్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, దీనికి బ్రోకరేజ్ సంస్థ రూ. 1,700 నుండి రూ. 1,785 కొత్త టార్గెట్ ధరని  కేటాయించింది. ఛాయిస్ బ్రోకింగ్ నుండి బై రేటింగ్ ఉన్న ఈ డిఫెన్స్ సెక్టార్ స్టాక్  మంచి రాబడిని సూచిస్తుంది. ప్రస్తుతం, ఈ స్టాక్ ధర రూ.1,504.80 వద్ద ట్రేడవుతు  రూ. 55 వేల 190 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఉంది. 

అశోక్ లేలాండ్ షేర్: ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్ స్టాక్ కూడా అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. గత ట్రేడింగ్ రోజున దీని షేర్ ధర 1% పెరిగి రూ.137.05 వద్ద ముగిసింది. బ్రోకరేజ్ సంస్థ దీనిని కొనొచ్చని  సిఫార్సు చేస్తోంది, పెట్టుబడిదారులు రూ.135 వరకు కొనుగోలు చేయవచ్చని చెబుతోంది, అయితే కొత్త టార్గెట్  ధర రూ.151-రూ.158గా నిర్ణయించింది. రూ.80 వేల 580 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఐదు సంవత్సరాలలో బలమైన 265% రాబడిని అందించింది. 

సెయిల్ షేర్: బ్రోకరేజ్ సంస్థ లిస్టులో ఐదవ స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది. 54 వేల 270 కోట్ల మార్కెట్ క్యాప్‌తో, ఈ కంపెనీ స్టాక్ ధర గురువారం రూ.131 వద్ద ముగిసింది. దీని ధర రూ.147 నుండి రూ.153కి చేరుకోవచ్చని ఛాయిస్ బ్రోకింగ్ చెబుతోంది. గత ఐదు సంవత్సరాలలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 287% కంటే ఎక్కువ రాబడిని అందించింది.