‘డీజే టిల్లు’ దర్శకుడి కొత్త చిత్రం షురూ.. హీరో ఎవరంటే..

‘డీజే టిల్లు’ దర్శకుడి కొత్త చిత్రం షురూ.. హీరో ఎవరంటే..

‘డిజే టిల్లు’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు విమల్ కృష్ణ.. చిన్న విరామం తర్వాత మరో డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రజెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. రాగ్ మయూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్నయ, చరిత్ర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ముహూర్తపు షాట్‌‌‌‌‌‌‌‌కు మేఘా చిలక, స్నేహ జగ్తియాని క్లాప్ కొట్టారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా డీవోపీగా,  జె.కె. మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా,  అభినవ్ కునపరెడ్డి ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రారంభించారు.