
ఇన్నాళ్లు ఫాంహౌస్ కూడా దాటని కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికలు రాగానే బయటకొస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. ఆయనకు వణుకు పుట్టినప్పుడల్లా ఢిల్లీకి పోతారని విమర్శించారు. పార్టీ నేతలను కాపాడుకునేందుకు కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు డీకే అరుణ. హుజూరాబాద్ లో TRS ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తున్నారన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తాను చేయించిన సర్వేలో ఈటల రాజేందర్ కు 70 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్న నేతలు.. మన్నెగూడ క్రాస్ రోడ్డు దగ్గర జరిగిన మీటింగ్ లో మాట్లాడారు. అధికారంలోకి వస్తే కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపించి తీరుతామన్నారు బీజేపీ నేతలు.