TG CETs 2026: మే 4 నుంచి EAPCET.. టీజీ సెట్స్–2026 షెడ్యూల్ రిలీజ్

TG CETs 2026: మే 4 నుంచి EAPCET.. టీజీ సెట్స్–2026 షెడ్యూల్ రిలీజ్
  • మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్​కు ఎగ్జామ్స్
  • మే 12న ఎడ్​సెట్.. 13, 14 తేదీల్లో ఐసెట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026–27) వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టుల (టీజీ సెట్స్–2026) షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 4 నుంచి 11 వరకు టీజీ ఎప్ సెట్ పరీక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. మంగళవారం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ సెట్స్ షెడ్యూల్​ను రిలీజ్ చేశారు. 

మే నెలలోనే దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు ఉండేలా షెడ్యూల్ రెడీ చేశారు. బీటెక్, బీఈ, బీఫార్మసీ, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఎప్ సెట్ లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్​కు మే 4, 5 తేదీల్లో.. ఇంజనీరింగ్ స్ట్రీమ్​కు మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈసారి కూడా టీజీ ఎప్ సెట్ నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూహెచ్ కే అప్పగించారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్లు, రిజిస్ట్రేషన్​ వివరాలను త్వరలోనే ఆయా ప్రవేశపరీక్షల కన్వీనర్లు ప్రకటిస్తారని బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షలన్నీ ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది కూడా ఎప్ సెట్ మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.