కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. పార్టీ మారే ప్రస్తక్తే లేదని అన్నారు. నిన్న(అక్టోబర్ 25) బీజేపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రటించిన నేపథ్యంలో బీజేపీ నుంచి మరికొంత మంది నేతలు పార్టీని వీడబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణలు.. పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా డీకే అరుణ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. అదంతా పూర్తి అవాస్తవమని తెలిపారు. 

Also Read :- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కూన శ్రీశైలం గౌడ్ ఫిర్యాదు

కాంగ్రెస్ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధిష్టానం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని..మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు అదృష్టం ఉండాలన్నారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని డీకే అరుణ స్పష్టం చేశారు.