అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడి సిగ్గుచేటు : డీకే అరుణ

అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడి సిగ్గుచేటు : డీకే అరుణ

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నాకు సిద్ధమైతేనే అరెస్ట్ చేసి కేసులు నమోదుచేసే పోలీసులు మరి ఇప్పుడేం కేసులు బుక్ చేస్తారో చెప్పాలని అన్నారు. ఈ దాడికి ప్రధాన కారకురాలైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదుచేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం దీనికి సంకేతమని అన్నారు.

ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కిటికీలు, కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.