హరీష్ రావు క్రెడిట్ KCR కొట్టేస్తున్నారు : DK అరుణ

హరీష్ రావు క్రెడిట్ KCR కొట్టేస్తున్నారు : DK అరుణ

హెరిటేజ్ భవనాలను కూల్చి కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు నిర్మించాలనుకుంటున్న కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి డీకే అరుణ. జనం డబ్బు వేస్ట్ చేస్తూ భవనాల నిర్మాణానికి అడుగు ముందుకేస్తే మాత్రం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఆ కూల్చివేతలు, నిర్మాణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారులను పక్కకు పెట్టి ఒక్క కుటుంబం కోసం పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా కేసీఆర్ చేయలేదన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటున్నారన్నారు. చింతమడకను హరీష్ రావు కాదు… తానే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పడానికి కేసీఆర్ ఆ ఊరికి వెళ్లారని చెప్పారు డీకే అరుణ. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.