ప్రధానమంత్రి మోడీత దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఇదే విషయంపై ఇవాళ(గురువారం) ఆమె మీడియాతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభినందించకపోగా .. టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ కు మాత్రం సోయి కూడా లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రజల సమస్యలపై పట్టింపు లేదని విమర్శించారు డీకే అరుణ.
