దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది బీజేపీనే : డీకే అరుణ

దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేది బీజేపీనే : డీకే అరుణ

పాలమూరు, వెలుగు : మోదీ నాయకత్వంలోనే భారత్​ విశ్వ గురువు అవుతుందని, అందుకు మూడో సారి బీజేపీ గెలవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ జిల్లా ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో వివక్షకు తావు లేకుండా బడుగు బలహీనవర్గాలకు సమానమైన పరిపాలన అందించడం, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడపడం బీజేపీ లక్ష్యం అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం ఒక బీజేపీకే సాధ్యమైందని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ర్ట కోశాధికారి శాంతి కుమార్, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, పాలమూరు సీడ్స్​ సుదర్శన్​ రెడ్డి, రాష్ర్ట నాయకురాలు పద్మజారెడ్డి, ఆర్​.బాలాత్రిపుర సుందరి, పడాకుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

గద్వాల, వెలుగు: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయి జయంతిని సోమవారం పట్టణంలో నిర్వహించారు. బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, టౌన్ ప్రెసిడెంట్ బండల వెంకట్ రాములు, కౌన్సిలర్లు త్యాగరాజు, కుమ్మరి శీను, రజక జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.