తండ్రిని కలిసే పరిస్థితి కూడా బిడ్డకు లేదా? : డీకే అరుణ

 తండ్రిని కలిసే పరిస్థితి కూడా బిడ్డకు లేదా? : డీకే అరుణ
  • కవిత లేఖపై ఎంపీ డీకే అరుణ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏం వచ్చిందని, కేసీఆర్ ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్  కుట్రలో భాగమే కవిత లేఖ అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్​తో ఉన్న రాజకీయ వైరంలో ఇది భాగమేనా అని శుక్రవారం ఒక ప్రకటనలో అరుణ ప్రశ్నించారు. కవిత లేఖ రాస్తే ఎలా బయటకు వచ్చిందని, ఎవరు రిలీజ్  చేశారని నిలదీశారు. ఇది రాజకీయ ఎత్తుగడ కూడా అయి ఉండవచ్చన్నారు.  

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్  అయ్యారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్  కలిసే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్  వారి ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటీలో నిలపకపోవడం ఆ పార్టీ అంతర్గత విషయమని పేర్కొన్నారు.